నందమూరి నట సింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ కూడా వచ్చాయి.ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 చేస్తున్నాడు.. గతంలో వచ్చిన అఖండ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

 'అఖండ 2' మూవీపై ప్రేక్షకుల లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.. ఇప్పుడు తెరకెక్కే అఖండ 2 సైతం ఓ రేంజ్ లో ఉండనుందని సమాచారం..ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలి గా వుంది.
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య బాబు 'అఖండ 2' కు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలకృష్ణను పవర్ ఫుల్ పాత్రకోసం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది.మేకప్ డిజైనర్ బాలయ్యను అఖండ పాత్రలో సిద్ధం చేస్తున్నారు..నుదిటిన నామాలు దిద్ది.. బొట్టు పెట్టింది. అలాగే గడ్డంపై కూడా వైట్ కలర్‌పూసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఇదిలా ఉంటే బాలయ్య తన తరువాత సినిమాను తనకి వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపి చంద్ మలినేని డైరెక్షన్ లో చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం..ఇప్పటికే గోపి చంద్ మలినేని చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తుంది..





మరింత సమాచారం తెలుసుకోండి: