హీరోయిన్ లలో డైరెక్టర్లు ఎన్నో రకాల యాంగిల్స్ చూస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ సినిమాకి ఆ హీరోయిన్ సెట్ అవుతుందా లేదా అనేది దర్శక నిర్మాతలు మొదట లుక్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత తాము అనుకున్న పాత్రకి ఆ హీరోయిన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అని అనుకుంటేనే ఆ సినిమాలో హీరోయిన్ కి అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది హీరోయిన్లకు గ్లామర్ పాత్రలు ఇవ్వాలంటే వారు ఎంత గ్లామర్ గా ఉన్నారు అని టెస్ట్ చేస్తారు. అలా చాలామంది హీరోయిన్లు ఎంత బోల్డ్ గా గ్లామర్ గా కనిపిస్తే అన్ని అవకాశాలు వస్తాయి అని నమ్ముతూ ఉంటారు. అయితే తాజాగా నటి మాళవిక మోహనన్ చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి. 

దర్శకుల కన్నంతా ఆ పార్ట్ పైనే ఉంటుంది అంటూ మాళవిక మోహనన్ మాట్లాడిన మాటలు చాలామందికి షాకింగ్ గా అనిపిస్తున్నాయి. మరి ఇంతకీ మాళవిక మోహనన్ ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు హీరోయిన్లలో నడుము, నాభి, ఎద అందాలను వంటి ప్రైవేట్ పార్ట్ లను మాత్రమే చూస్తారు.హీరోయిన్ల ఫోటోలు జూమ్ చేసి మరీ నాభి,నడుమును  ఎక్కువగా చూస్తూ ఉంటారు.. అంటూ మాట్లాడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

అయితే మాళవిక మోహనన్ చెప్పిన మాటల్లో కూడా నిజముంది. ఎందుకంటే చాలామంది దర్శకులు తమ సినిమాల్లో ఉండే హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గానే చూస్తారు. ఎంత గ్లామర్ ఒలకబోస్తే సినిమా అంత హిట్టు అనేలా అనుకుంటారు.అంతేకాదు వారికి సరైన పాత్రలు ఇవ్వరుగానీ గ్లామర్ వరకు మాత్రమే తీసుకుంటారు. ఇక మాళవిక మోహనన్ ప్రస్తుతం మోహన్ లాల్ హృదయపూర్వం, ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలలో నటిస్తోంది. ఇక ఈ హీరోయిన్ తెలుగు, తమిళ,మలయాళ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: