మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. 'దేవర' జపాన్ ప్రమోషన్స్ తో పాటు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మెరిసిన ఎన్టీఆర్.. బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ చేసాయి.... అయితేఎన్టీఆర్ అంతలా బక్క చిక్కి పోవడానికి అసలు కారణం తన అన్న కళ్యాణ్ రామ్ తెలిపాడు.. ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న 'డ్రాగన్' సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ‘దేవర', మరియు 'వార్ 2'లో రగ్గడ్ లుక్‌లో కనిపించారు. అయితే, 'డ్రాగన్' సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారని తెలుస్తుంది..

 అయితే ప్రశాంత్ నీల్ గత చిత్రాలు చూసుకుంటే ఆయన సినిమాల్లో హీరోలు సాధారణంగా కండలతో, బలమైన రూపంలో కనిపిస్తారు.., 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్‌ను మాత్రం సన్నగా చూపించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట.అయితే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కవుట్ రొటీన్‌ను అనుసరించి తన శరీర ఆకృతిని ఎన్టీఆర్ పూర్తిగా మార్చుకున్నారని సమాచారం.. 'డ్రాగన్' సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నారు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనేందుకు బయలుదేరారు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు.. అయితే షూటింగ్ ఎక్కడో మాత్రం వారు తెలుపలేదు..

అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.. ప్రశాంత్ నీల్ మాత్రం ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నాడని అర్ధం అవుతుంది..ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: