సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మధ్య జరిగే కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టుగా వెళుతూ ఉంటుంది. అలా ఇప్పటికి ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కొంతమంది ఆ పాత్రలలో జీవించిపోయి మరి నటించిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా తమాషా సినిమాలో జరిగిన సన్నివేశం చూస్తే అందరికీ ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేస్తోంది. రణబీర్ కపూర్, దీపిక పదుకొనే మధ్య  ఉండే ప్రేమ మరొకసారి తెరపైన కనిపించబోతోంది.


ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడంతో పాటు సినిమా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం పైన సెన్సార్ టైంలో ఒక సన్నివేశాన్ని సైతం కట్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా రణబీర్, దీపిక మధ్య ఉండే లిప్ లాక్ సన్నివేశమే చాలా హాట్ గా ఉండడంతో వాటిని తొలగించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఒక క్లిప్పింగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ వీడియో చూసిన వారందరూ కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారందరూ కూడా వీరి రొమాన్స్ మరి ఇంత హాట్ గా ఉంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


దీపిక, రణబీర్ మధ్య లవ్ ట్రాక్ కొన్నేళ్లపాటు కొనసాగిన కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. దీంతో అప్పట్లో దీపిక డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయిందని అందుకు సంబంధించి కాఫీ విత్ కరెంట్ టాక్ షోలో తెలియజేసింది. అలాంటి వ్యక్తిని భరించడం నిజంగానే కష్టమని వెల్లడించింది. అయితే ఈ కామెంట్స్ కు సోనమ్ కపూర్ కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కత్రినా కైఫ్ తో కూడా రణబీర్ ప్రేమాయణం నడిపారని చివరికి వారు కూడా విడిపోయారని ఫైనల్ గా ఆలియా భట్ ను ప్రేమించి మళ్లీ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: