నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు. కానీ ఓ సినిమా కథ నచ్చిన కూడా అది తనపై వర్కౌట్ కాదు అని చెప్పి మరో హీరో పేరును సూచించాడట. ఆ మూవీ నిర్మాత కూడా బాలకృష్ణ చెప్పిన హీరోతో ఆ మూవీ ని రూపొందించగా ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ సినిమా ఏది ..? బాలకృష్ణహీరో పేరును సూచించాడు ..? అసలు ఆ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన ఆసక్తి కరమైన వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మలయాళం లో అయ్యప్పనున్ కోషియన్ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా యొక్క తెలుగు హక్కులను సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో ఒక పాత్రకు బాలకృష్ణ అయితే బాగుంటుంది అనుకొని నాగ వంశీ ఆ మూవీ మొత్తాన్ని బాలకృష్ణ కి చూపించి ఇందులో మీరు ఒక పాత్ర చేయండి సార్ అని అడిగాడట. దానితో బాలకృష్ణ మూవీ సూపర్ గా ఉంది. కానీ నువ్వు నాకు ఏ పాత్ర చేయమని అడుగుతున్నావో ఆ పాత్రలో నాకంటే పవన్ కళ్యాణ్ అద్భుతంగా ఉంటాడు అని చెప్పాడట.

దానితో నాగ వంశీ , పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ మూవీ ని చూపించగా అందులో బాలకృష్ణ సూచించిన పాత్రలో పవన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఆ తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా భీమ్లా నాయక్ అనే టైటిల్ తో అయ్యప్పనున్ కోషియన్ మూవీ ని రీమేక్ చేయగా ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ కు మంచి గుర్తింపు కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: