ప్రతి మనిషికి కొన్ని కోరికలు, అలవాట్లు, కలలు ఉంటాయి. అవి ఎలా ఉన్న సరే మనం అంతా తొందరగా వాటిని వదులుకోలేము. ఒక్కో మనిషికి.. ఒక్కో విచిత్రమైన అలవాటు ఉంటుంది. అయితే ఇలాంటి విచిత్రమైన అలవాట్లు సెలబ్రెటీలకు కూడా ఉంటాయి. ముఖ్యంగా నెటిజన్స్ సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా.. ఇలాంటి ఒక వింత అలవాటు ఒక సీనియర్ హీరోయిన్ కి ఉంది అంట. మరి ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో.. ఆ వింత అలవాటు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన హీరోయిన్ టబు గురించి పరిచయం అనవసరం. ఈ భామ ఒక అచ్చ తెలుగు అమ్మాయి. ఈ బ్యూటీ బజార్ అనే హిందీ మూవీలో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత హమ్ నే జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఈమె టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కూలీ నెంబర్ 1తో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. తర్వాత సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, అందరివాడు, షాక్ సినిమాలో నటించింది. ఈ భామ తెలుగుతో పాటుగా తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ భాషలలో నటించింది. అయితే టబు కి ఒక విచిత్రమైన అలవాటు ఉంది అంట. ఎంత లేట్ అయిన సరే ఈమె రాత్రి పడుకునే ముందు కాఫీ తాగుతుంది అంట. ఎక్కడికి వెళ్లిన ఆమె ఫేవరెట్ కాఫీ బ్రాండ్ ను తన వెంట తీసుకెళ్తుంది అంట.


ప్రస్తుతం డైరక్టర్ పూరీ జగన్నాథ్, స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో ఓ సీనియర్ హీరోయిన్ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది. అయితే ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తున్నారు. తాను మరెవరో కాదు స్టార్ నటి టబు. ఈ అందాల భామకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని మూవీ మేకర్స్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: