ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎక్కువగా హింస ఆశ్లీలతనే కనిపిస్తుంది. కానీ ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా లేని సినిమాలు వచ్చాయంటే కచ్చితంగా అది శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమానే అనుకుంటారు. ఎందుకంటే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన సినిమాల్లో ఎలాంటి హింసాత్మక సన్నివేశాలను అసభ్యంగా హీరోయిన్లను చూపే సన్నివేశాలను తెరకెక్కించారు.ఆయన చాలా సింపుల్ గా అద్భుతమైన ప్రేమకావ్యాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అలా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే అది చాలా నేచురల్ గా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన లీడర్,హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,ఆనంద్,గోదావరి, ఫిదా వంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడమే కాదు ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. అయితే అలాంటి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.అలాగే వరుణ్ తేజ్ కి మొదటి హిట్ ఈ సినిమా వల్లే పడిందని చెప్పుకోవచ్చు.

 వరుణ్ తేజ్ కెరీర్ ని ఫిదా సినిమా మార్చేసింది.అలా వరుణ్ తేజ్,సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఇప్పటికీ చాలామంది టీవీలలో వచ్చినా ఇష్టంగా చూస్తారు. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఫిదా మూవీ కోసం మొదట వేరే హీరో హీరోయిన్  ని అనుకున్నారట.కానీ ఆ హీరో కి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం కారణంగా చివరికి వరుణ్ తేజ్ ని పెట్టి ఈ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల  ముందుగా అనుకున్న హీరో హీరోయిన్లు ఎవరయ్యా అంటే..మహేష్ బాబు,దీపిక పదుకొనే.అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఫిదా మూవీ స్టోరీ మొదట మహేష్ బాబు కి చెప్పగా ఆయనకు బాగా నచ్చి కొన్ని చేంజెస్ కూడా చేయించుకున్నారట.ఆ తర్వాత సినిమా చేస్తానని మాట ఇచ్చాక డేట్స్ ఖాళీగా లేకపోవడంతో మహేష్ బాబు శేఖర్ కమ్ములకు ఫోన్ చేసి సారీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల సినిమా చేయలేకపోతున్నాను అని చెప్పారట. 
కానీ మహేష్ బాబు స్టార్ హీరో కాబట్టి ఆయన డేట్స్ ఆయన చేతిలో ఉండవు అనే విషయం డైరెక్టర్ శేఖర్ కమ్ములకు తెలుసు. దాంతో ఆయన కూడా మహేష్ ని ఏమీ అనలేక చివరికి వరుణ్ తేజ్, సాయి పల్లవిని ఈ సినిమాకి తీసుకున్నారు. అలా మహేష్ బాబు దీపికా పదుకొనే కాంబోలో రావాల్సిన ఫిదా వరుణ్, సాయి పల్లవి కాంబోలో వచ్చింది. అయితే ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఫిదా సినిమాలో మహేష్ దీపికా కంటే వరుణ్, సాయి పల్లవి లకే బాగా సెట్ అయింది.ఒకవేళ మహేష్ దీపిక నటిస్తే అంత హిట్ అయ్యేది కాదు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు . ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ప్రస్తుతం కుబేర మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ రష్మిక హీరో హీరోయిన్లుగా నాగార్జున విలన్ గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: