టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. బాలయ్య బాబు ఇటు సినీ రంగంలో.. అటు రాజకీయ రంగంలో దూసుకెళ్తున్నారు. అయితే నందమూరి టైగర్ మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ లోని ఆర్టీఏ ప్రభుత్వ సంస్థ ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాట నిర్వహించింది. 0001 అనే ఫ్యాన్సీ నెంబర్ కి పెద్ద ఎత్తున వేలం పాట జరిగింది. ఇంకేముంది బాలయ్య బాబు తగ్గేదే లే అంటూ ఏకంగా రూ. 7.75 లక్షలు ఖర్చు పెట్టి వేలం పాటలో గెలిచారు. దీంతో ఆయన మరోసారి రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రతిదాంట్లో నెంబర్ 1గా నిలవాలనే కోరిక బాలయ్య బాబుకి ఎప్పుడు ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ బాలయ్య బాబు అంటే మామూలుగా ఉండదు మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

ఆయనకు యంగ్ స్టార్స్ నుండి ఏజ్ అయిన వాళ్లదాకా ఫాన్స్ ఉన్నారు. బాలయ్యకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్ని హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగింది. ఇక ఇటీవలే బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమా థియేటర్ లో విడుదల అయ్యి.. మంచి హిట్ ని అందుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చెరిపోయింది.

ఇక ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ 2: తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: