భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టెండుల్క‌ర్ కుమార్తె సారా టెండుల్క‌ర్‌. ఆమె న‌టి కాదు .. క్రికెట‌ర్ కూడా కాదు .. కానీ త‌న అందంతో ఆమె దేశాన్ని ఆక‌ర్షించింది. సోష‌ల్ మీడియాలో ఆమె ఇప్పుడు ఓ స్టార్.. సెల‌బ్రిటీ. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఆమె క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్ తో డేటింగ్ చేస్తుంద‌న్న వార్త‌ల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రే క‌లిసి క‌నిపించే వారు. దుబాయ్ లో కూడా సారా .. గిల్ క‌లిసి ఎన్నో సంద‌ర్భాల్లో కనిపించారు. అయితే వీరిద్ద‌రు తాము ప్రేమ‌లో ఉన్నాం అనే విష‌యాన్ని ఎక్క‌డా ఎప్పుడూ ప్ర‌క‌టించ‌లేదు. దాదాపు ఐదేళ్ల పాటు వీరు త‌మ బంధాన్ని కంటిన్యూ చేశారు. వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ లో ఉన్న విష‌యం స‌చిన్ కు న‌చ్చ‌లేద‌ని .. గిల్ తో దూరంగా ఉండాల‌ని కూడా స‌చిన్ త‌న కుమార్తెకు వార్నింగ్ ఇచ్చారంటూ ప్ర‌చారం జ‌రిగింది.

తాజా అప్ డేట్ ప్ర‌కారం వీరి బంధం బ్రేక‌ప్ అయిన‌ట్టు స‌మాచారం. గిల్ కు సారా దూరంగా జ‌రిగిన‌ట్టు గా తెలుస్తోంది. అత‌డి ఇన్ స్టా అక్కౌంట్ ను ఆమె అన్ ఫాలో చేసిన‌ట్టు స‌మాచారం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా సోష‌ల్ మీడియా లో ఒక‌రినొక‌రు ఫాలో అయ్యారు. ఇప్పుడు సారా .. గిల్ ను అన్ ఫాలో చేయ‌డంతో వీరిద్ద‌రు విడిపోయిన‌ట్టు టాక్ ? అయితే వీరిద్ద‌రి బంధం లో ఒక‌రు చిచ్చు పెట్టార‌ట‌. ఆమె ఎవ‌రో ?  కాదు. 23 ఏళ్ల అవ్నీత్ కౌర్‌. ఆమె గిల్‌కు ద‌గ్గ‌రైన‌ట్టుగా స‌మాచారం. ఇది న‌చ్చ కే సారా .. గిల్ కు దూరం జ‌రిగి .. అత‌డితో బ్రేక‌ప్ చెప్పేసిందంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: