- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా తిరుగులేని పేరు తెచ్చి పెట్టింది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ సినిమా త‌ర్వాత వ‌చ్చిన మ‌గ‌ధీర సినిమా అప్ప‌ట్లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్. చిన్న ప‌ల్లెటూర్ల‌లో సైతం మ‌గ‌ధీర సినిమా 100 రోజులు ఆడి వ‌సూళ్ల ప‌రంగా ఇండ‌స్ట్రీలో ఎన్నో రికార్డుల దుమ్ము దులిపేసింది. 2009లో మగధీర మానియాతో నాటి ఆంధ్రదేశ్‌ ఉర్రూతలూగిపోయింది. పైగా చిరు ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో ఓడిపోయాక నిరాశ‌తో ఉన్న మెగాభిమానుల‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చింది ఈ సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అగ్రనిర్మాత‌ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించి భారీ లాభాలు సొంతం చేసుకున్నారు.


ఇదిలా ఉంటే మ‌గ‌ధీర సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ కు జోడీగా కాజ‌ల్‌ను ఎంపిక చేశారు. కాజల్ పై ఫోటోషూట్ చేశాక.. ఆమె అయితేనే రాకుమారి పాత్రలో బాగా సూట్ అవుతారని ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆ త‌ర్వాత వీరి కాంబోలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా కూడా వ‌చ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ మోస్త‌రుగా ఆడింది. అయితే మ‌గ‌ధీర హిట్ అయ్యాక ఆ వెంట‌నే వీరి కాంబోలో మెరుపు టైటిల్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ తో బంగారం లాంటి సినిమా తెరకెక్కించిన త‌మిళ‌ దర్శకుడు ధరణి దర్శకత్వంలో ఏఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో మెరుపు సినిమా ప్లాన్ చేసినా కథ సరిగా రాలేదన్న కారణంతో మెరుపు సినిమా మధ్యలోనే ఆగిపోయింది.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: