
కుర్రాడికి ఎంతో భవిష్యత్తు ఉందని ఈ సినిమాలో చూపించి అతని భవిష్యత్తును నాశనం చేయాలనే కథాంశంతో కథనాన్ని నడిపించారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని కూడా అనవచ్చని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. న్యాయవాదుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారా అనేలా ఈ సినిమాలో రెండు పాత్రలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ కు ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండు అనిపించిందని పరుచూరి పేర్కొన్నారు. ఎవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకూడదని అనుకుంటాడని మంగపతి ధనిక, పేద తేడాలు ఉన్నవాడని ఒకవేళ అమ్మాయి మేజర్ అయితే సినిమా వేరేలా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. మైనర్ పై చేయి చేసుకోవడం, బెల్ట్ తో కొట్టడం నేరం కాబట్టి మంగపతిని అరెస్ట్ చేయాలని ఆయన తెలిపారు.
16 నిమిషాల పాటు ఏం చేసి ఉంటారు? అనే అంశాన్ని రివీల్ చేయకుండా ఆసక్తి రేకెత్తించారని ఆయన కామెంట్లు చేశారు. హీరో హీరోయిన్లు బాగా చదువుకుని గొప్పవారై పెళ్లి చేసుకున్నట్టు చూపించి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ ఇచ్చిన రివ్యూ బాగుందని నెటిజన్లు ఫీలవుతున్నారు. కోర్ట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ ప్రాజెక్ట్ సాధ్యమవుతుందో లేదో చూడాలి.