
వాటికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో టీజర్ ని కూడా రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో జైలర్ 2 సినిమా పైన అటు తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక రిలీజ్ రోజున మినిమం ఓపెనింగ్స్ అందుకుంటుందని టాక్ కూడా వినిపిస్తోంది. ఫైనల్ గా మొదటి రోజు 100 కోట్లకు అటు ఇటుగా రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రెండ్ వర్గానిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే జైలర్ 2 సినిమా థియేటర్ రైట్స్ ను కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది.
తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్ లో ప్రముఖ బడ బ్యానర్ సంస్థ తెలుగు స్టేట్స్ రైట్స్ కోసం మేకర్స్ ని సంప్రదించగా 60 కోట్ల రూపాయల వరకు డీల్ ఆఫర్ చేసిన కూడా మేకర్స్ ఒప్పుకోలేదట...జైలర్ 2 మేకర్ తో మాత్రం అందుకు ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. జైలర్ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిందని అదనంగా మరొక పాతిక కోట్ల రూపాయలు అడిగినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం విని కంగుతిన్న ఆ బడా నిర్మాణ సంస్థ.. రిస్క్ ఎందుకని వెనక్కి తగ్గిందట. గతంలో కూడా రజనీకాంత్ నటించిన రోబో 2.O సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.