
టాలీవుడ్ పెద్దలు కూడా ఈ కల్చర్ ను ఎగదోయడానికి ప్రధాన కారణం దియేటర్ల ఆకుపెన్స్ .. కనీసం స్టార్ హీరోల సినిమాల రీరిలీజుల కైనా ప్రేక్షకులు వస్తే మరోసారి వారికి పాత రోజులు గుర్తొస్తాయని , అలా ఆడియన్స్ క్రమంగా థియేటర్లకు అలవాటు పడతారని అంతా అనుకున్నారు .. అలా స్టార్ హీరోల సినిమాల కు ఆక్యుపెన్సి పెరుగుతుంద ని భావించారు .. కానీ ఇక్కడ టాలీవుడ్ పెద్దలు ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరుగుతుంది .. రీ రిలీజ్ ట్రెండ్ అనేది కేవలం హీరోల అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రమే పరిమితం అయిపోయింది .. సాధారణ ప్రేక్షకులు ధియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు .. ఇలా ఫలితంగా రెగ్యులర్ సినిమాలకు కూడా ఆక్యు పెన్సి సరిగ్గా కనిపించడం లేదు ..
మంచి సినిమా వస్తే వీకెండ్ లో ఓ మాస్తరు జనం కనిపిస్తున్నారు . అలా వచ్చిన సినిమా ఫ్లాఫ్ అయితే సోమవారం నుంచి మళ్లీ థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి .. ఎలాంటి అంచనాలు లేకండా సినిమా వచ్చిందంటే వీకెండ్స్ కూడా థియేటర్లో ఖాళీగా కనిపిస్తున్నాయి .. ఇలా మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ థియేటర్ కల్చర్ మొత్తం మారిపోయింది .. గతంలో పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న నటుల సినిమాలు కూడా ఓ మోస్తరు స్థాయిలో ప్రేక్షకులను మెప్పించేవి .. మళ్లీ టాలీవుడ్ కు పాత రోజులు రావాలి సినిమా ఏదైనా ప్రేక్షకులు సరదాగా థియేటర్లకు వచ్చే పరిస్థితులు కనిపించాలి .. ఇక అవి జరగాలంటే మంచి కథలు రావాలి .. పనిలో పనిగా టిక్కెట్ రేట్లు కూడా తగ్గాలి ..