
రోషన్ చాలా చిన్న ఏజ్ లోనే సినిమాల్లో అడుగు పెట్టారు .. టు ఎర్లీ ఎంట్రీ కావడం తో పెద్దగా సక్సెస్ అందుకోలేదు .. కోర్టు లాగా అదే సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే వేరే విధంగా ఉండేదేమో ? పెళ్లి సందడి టైటిల్ తో రాఘవేంద్రరావు మరో సినిమా తీసినప్పుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు .. సినిమా కూడా మంచి విజయం సాధించింది శ్రీ లీల డాన్సులు పాటల తో పాటు రోషన్ లుక్స్ , డాన్సులు అన్నీ కూడా సినిమా విజయం లో కీలకపాత్ర పోషించాయి .. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు .. అయితే ఇది ఓ విచిత్రమైన పరిస్థితి ఇలా మారింది ..
అయితే ఇక్కడ హీరో శ్రీకాంత్ మాత్రం తన కొడుకు కోసం ఎలాంటి ప్లానింగ్ ఎక్కడ ఇవ్వటం లేదు .. మలయాళం లో ఓ సినిమా లైన్లో ఉంది .. అలాగే అశ్వినీదత్ తో ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది .. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను నిర్మించిన నిర్మాత ముప్ప అశోక్ తో ఓ సినిమా డిస్కషన్ లో ఉంది .. ఇలా స్లో ఆండ్ స్టడీడీ అన్నట్లుగా .. రోషన్ ముందుకు వెళ్తున్నాడు .. కానీ ఇక్కడ రోషన్ లుక్స్ అన్ని చూస్తుంటే టాలీవుడ్ లో ఓ మంచి యంగ్ హీరోగా క్రేజ్ తెచ్చుకొనే లక్షణాలు అయితే మాత్రం గట్టిగా కనిపిస్తున్నాయి ..