సౌత్ ఇండియాలో దర్శకుడిగా, విలన్ గా ఎస్జే సూర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్ సినిమాలు సూర్యకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఎస్జే సూర్య పారితోషికం సైతం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందనే సంగతి తెలిసిందే. అయితే ఎస్జే సూర్య తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.
 
విలన్ రోల్స్ కు గుడ్ బై చెప్పాలని ఎస్జే సూర్య ఫీలవుతున్నారని వైరల్ అవుతున్న వార్తల సమాచారం. ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఎస్జే సూర్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ కొరుకుంటున్నారు. మరి కొందరు మాత్రం ఎస్జే సూర్య డైరెక్టర్ గా బిజీ కావాలని కామెంట్లు చేస్తుండటం నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.
 
ఎస్జే సూర్య విలన్ రోల్స్ కు దూరమైతే మాత్రం ఒక వర్గం ప్రేక్షకులు ఫీలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎస్జే సూర్య కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తారేమో చూడాలి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
 
విలక్షణమైన నటనతో ఎస్జే సూర్య సత్తా చాటుతున్నారు. ఎస్జే సూర్య సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను పెంచుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఎస్జే సూర్య ఇతర భాషల్లో సైతం అంతకంతకూ ఎదిగి మార్కెట్ ను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎస్జే సూర్య ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఎస్జే సూర్య గతంలో స్పైడర్ సినిమాలో సైతం విలన్ గా నటించి మెప్పించడం గమనార్హం. ఎస్జే సూర్య టాలెంట్ కు తగినంత గుర్తింపు రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.






మరింత సమాచారం తెలుసుకోండి: