- ( బాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

దెయ్యం పేరు చెబితే అంతా భయపడిపోతూ ఉంటారు .. కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం రెడ్ కార్పెట్ వేసి వాటిని ఆహ్వానిస్తున్నారు .. ఇంకా చెప్పాలంటే దెయ్యాలను వాళ్లు దత్త పుత్రికల్లా భావిస్తున్నారు .. దెయ్యం సినిమాల కు ఉన్న క్రేజ్ చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే .. ఇంట్లో కుక్కల్ని పిల్లల్ని పెంచుకున్నట్టు నార్త్‌ నిర్మాతలు దెయ్యాలని పెంచుకుంటున్నారు .. ఇక మరి ఈ స్టోరీ ఏంటో ఇక్కడ చూద్దాం .. బాలీవుడ్ లో వచ్చిన స్త్రీ 2 సినిమా కు ఏకంగా 700 కోట్ల కలెక్షన్ రావటం తో బాలీవుడ్ లో దెయ్యాల సినిమాల పై మరింత ఆసక్తి పెరిగింది .. అవసరం ఉన్న లేకపోయినా ఓ దెయ్యం సినిమా చేస్తే సరిపోతుంది లే అని అక్కడ వారు భావిస్తున్నారు ..


ఈ క్రమం లోనే తాజాగా ఈ లిస్టులోకి సంజయ్ దత్ కూడా దెయ్యం స్టోరీ తో వచ్చేస్తున్నాడు .. మే 1 న రిలీజ్ కానుంది ఈ మూవీ .. దెయ్యాల పై నమ్మకం తో భూతిని చేస్తున్నారు సంజయ్ దత్ .  సిద్ధాంత్ సచ్‌దేవ్ ఈ సినిమా దర్శకుడు .. ఈమధ్య కాలం లో బాలీవుడ్ పూర్తి గా దెయ్యాల కొంప గా మారిపోయింది .. స్త్రీ 2 , భూల్ భులయ్యా 3 , ముంజియా లాంటి సినిమాలు కాసుల వర్షం కురిపించడం తో అంత అటు వైపే అడుగులు వేస్తున్నారు . కాస్త ప్రేక్షకులను భయపెట్టి నవ్విస్తే చాలు వందల కోట్లు ఇచ్చేస్తున్నారు ప్రేక్షకులు .. అందుకే ఇదే ట్రెండ్ అక్కడ ఫాలో అవుతున్నారు .. మ్యాడాక్ ఫిల్మ్స్ అయితే  .. రాబోయే మూడేళ్లలో తమ బ్యానర్ నుంచి ఏకంగా 8 హారర్ సినిమాలను తీసుకురాబోతున్నారు .  స్త్రీ 3, భేడియా 2, ముంజియా 2, పెహ్లా మహాయుధ్, దూస్రా మహాయుధ్, శక్తి షాలిని లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచే రాబోతున్నాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: