గతంలో ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించిన  హీరోయిన్ సిమ్రాన్ ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉంది. భాషతో సంబంధం లేకుండా నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య, చిరంజీవి ,నాగార్జున, వెంకటేష్ చిత్రాలలో నటించిన సిమ్రాన్ ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో సినిమాలలో కూడా నటిస్తోంది. ఇటీవలే ఒక అవార్డు ఫంక్షన్ లో సిమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే సిమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు తన కో యాక్టర్ ని ఉద్దేశించే చేసిందనే విధంగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే హీరోయిన్ సిమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది నటి జ్యోతికనే అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవలే ఆమె డబ్బా క్యారెక్టర్లలో చేసింది కాబట్టి ఇన్ డైరెక్ట్ గానే జ్యోతికనే అని ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. మరికొందరు హీరోయిన్ లైలా, స్నేహ అని అంటున్నారు.కానీ మొత్తానికి మాత్రం హీరోయిన్ సిమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సిమ్రాన్ ఇలా మాట్లాడడానికి ముఖ్య కారణం.. తన తోటి నటి నటనను చూసి ఒకసారి తాను మెసేజ్ చేశానని.. ఇలాంటివి ఎందుకు ఎంచుకుంటున్నావని అడిగితే ఆంటీ పాత్రల కంటే ఈ తరహా పాత్రలలోనే నయమంటూ కౌంటర్ వేసిందని..


కానీ డబ్బా రోల్స్ పాత్రలో కంటే ఆంటీగా అత్తగా కనిపించడమే నయమంటూ సిమ్రాన్ ఇలా స్టేజి మీద పబ్లిక్ గా కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కానీ సిమ్రాన్ మాత్రం ఎవరిని ఉద్దేశించి అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు ఎవరిపైన అన్నది అనే విషయం పైన రాసుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే వస్తుంది. చాలా గ్యాప్ తర్వాత సిమ్రాన్ ఇటీవలే మళ్లీ బిజీ యాక్టర్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: