తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది. కానీ అప్పుడప్పుడు వీరు చేసి కొన్ని పనుల వల్ల పలు రకాల రూమర్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు సమంత కూడా తాజాగా ఒక ఫోటోకి లైక్ చేయడంతో సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం ఇదే అన్నట్లుగా కొన్ని రూమర్స్ మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కి సమంత లైక్ చేసింది. అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికి భర్త ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఒక సర్వే గురించి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమంత ఆ పోస్ట్ ని లైక్ చేసింది.


దీంతో ఇప్పుడు సమంత అభిమానులు సమంత అనారోగ్య కారణంగానే  సమంత నుండి నాగచైతన్య విడాకులు తీసుకున్నారనే విధంగా న్యూస్ ని వైరల్ చేస్తూ ఉన్నారు. సమంత సక్సెస్ వేర్స్ అని సోషల్ మీడియా ఖాతాలో నుంచి ఆరోగ్యం అనుబంధం వంటి విషయాల పైన ఎక్కువగా ఆసక్తికరమైన పోస్టులు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వైవాహిక వ్యవస్థ బలహీనం కావడం పైన ఇటీవలే ఒక పోస్ట్ కూడా షేర్ చేయడం జరిగింది.



 జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురి అయితే పురుషుడు ఆమెను వదిలేసేయడానికి ఇష్టపడుతున్నారనే విధంగా రాసుకుంటూ అలాగే మహిళలు మాత్రం అందుకు భిన్నంగా భర్త ఆరోగ్యం బాగోకపోయినా కూడా అతడిని విడిచిపెట్టడం లేదు అంటూ ఒక తాజా సర్వే ప్రకారం ఇది నిరూపితమైనది అంటూ రాసుకు వచ్చారు.. అలాగే భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే ఎక్కువగా భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని సర్వేలో తేలిందని ఈ పోస్ట్ సారాంశం.. కానీ సమంత తోపాటు 60 వేల మందికి పైగా నేటిజన్స్ లైక్ చేసిన సమంత ఈ పోస్ట్ కి లైక్ చేయడం ఇప్పుడు అందరికీ అనుమానాలను కలిగించేలా చేస్తోంది. 2021లో వైవాహిక బంధానికి స్వస్తి చెప్పినట్లుగా ప్రకటించారు. కానీ నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం మాత్రం చెప్పలేదు.. ఆ తర్వాత సమంత మయోసైటిస్ తో ఇబ్బందులు పడడం అందుకు చికిత్స తీసుకోవడం వంటివి జరుగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: