
ఇవి చాలా దాన్నట్లుగా ఇప్పుడు తాజాగా మళ్లీ అల్లు అర్జున్ పైన అటు శ్రీ లీలా పైన ఒక వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పైన పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు అయినట్లుగా సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవలే జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల అవ్వడంతో అల్లు అర్జున్, శ్రీ లీల మెడకు చుట్టుకున్నట్లుగా తెలుస్తోంది. టాప్ కాలేజీలు, టాప్ ర్యాంక్స్ అంటూ మా కాలేజీలో చదివిన వారే అంటూ టాప్ ర్యాంకర్స్ ఫోటోలను సైతం చాలా కాలేజీలు పత్రికలలో పలు రకాల శీర్షికలలో కూడా యాడ్స్ సైతం ఎక్కువగా చూపించారు. దీంతో విద్యార్థి సంఘాలు కూడా అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఒకే విద్యార్థి పలు రకాల కాలేజీలలో ఎలా చదువుతారు అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది.
అయితే వీటిని నమ్మి చాలామంది తల్లిదండ్రులు సైతం మోసపోతున్నారని.. పలు రకాల ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు శ్రీ లీల, అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా రిమోట్ చేస్తూ ఉండడంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు నష్టపోతున్నారని ఏఐఎస్ఎఫ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ కాలేజీలు కూడా పారితోషకాలు ఇచ్చి మరి ఇలా ప్రమోట్ చేసుకుంటున్నాయని.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి స్త్రీల అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి అంటు AISF తెలియజేసింది. ఇందుకు సంబంధించి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.