టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో నాని ఒకరు. నాని అతి త్వరలో హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డ్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. అయితే హిట్3 సినిమా విషయంలో నాని హాయ్ నాన్న మూవీ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.
 
హిట్3 సినిమా కోసం ఓవర్సీస్ కు వెళ్తున్న నాని ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. హిట్3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో వెళ్లని లొకేషన్లకు న్యాచురల్ స్టార్ వెళ్లనున్నారని తెలుస్తోంది. హిట్3 స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించానని శ్రీనిధి శెట్ట్ వెల్లడించారు. నాని అంటే ఒక బ్రాండ్ అని ఈ హీరోయిన్ చెప్పుకొచ్చారు.
 
నాని సినిమాలో ఆఫర్ వచ్చిన సమయంలో ప్రశ్నలు అడగకుండా అంగీకరించాలని శ్రీనిధి శెట్టి పేర్కొన్నారు. నేను ఈ సినిమాలో ఆయన భార్యగా కనిపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. నేను ప్రోమోస్ లో ఎక్కువగా కనిపించకపోయినా నా రోల్ శక్తివంతమైనదని శ్రీనిధి శెట్టి కామెంట్లు చేయడం గమనార్హం. ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నారు.
 
మే నెల 1వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రీ సేల్స్ లో హిట్3 సినిమా అదరగొట్టిందని చెప్పవచ్చు. ఒక్కరోజులోనే ఈ సినిమా ఏకంగా 75 వేల డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోమవారం నాని ముంబైకు వెళ్లగా అక్కడ కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో నాని రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: