గత రెండు రోజుల నుంచి డ్రగ్స్ విషయంలో తెగ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. అయితే ఇటీవలే పోలీసులు  అరెస్టు కూడా చేశారు. పోలీసులు విచారణలో భాగంగా ఈ నటుడు పలు కీలకమైన విషయాలను కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. తాను డ్రగ్స్ వాడటం నిజమే అన్నట్లుగా పోలీసు ఎదుటే ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎంతో మంది డ్రగ్స్ వాడుతున్నారని తననే పోలీసులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అన్నట్లుగా పోలీసులను ప్రశ్నించారట నటుడు షైన్ టామ్ చాకో.


డ్రగ్స్ సరఫరా చేసేవారు తాను అడిగినప్పుడు తెచ్చి ఇస్తున్నట్లుగా తెలియజేశారు. కొన్ని సందర్భాలలో సినిమా సెట్లలోకి కూడా తీసుకువచ్చారని తెలిపారు చాకో.. దీంతో వెంటనే అతని మొబైల్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని బ్యాంకు యొక్క ట్రాన్సాక్షన్ ని కూడా పరిశీలించారు. అయితే అందులో పేమెంట్స్ గురించి అడిగినప్పుడు మాత్రం అందులో కొన్నిటిని వారికి అప్పుగా ఇచ్చినట్లు తెలియజేశారు నటుడు షైన్ టామ్ చాకో. అయితే ఇక హోటల్ నుంచి పారిపోయిన సంఘటన గురించి పోలీసులు అడగగా..



అయితే అక్కడికి  తెలిసిన అమ్మాయిని కలవడానికి వచ్చానని.. కొంతమందితో  తనకు గొడవలు ఉన్నాయని అందుకోసమే వారు తనకోసం వచ్చారెమో అనుకొని పారిపోయానని తెలియజేశారు. నటి విన్సీ చేసిన ఆరోపణల పైన కూడా ప్రశ్నించగా తాను ఎవరితో కూడా ఎప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించలేదని ఎక్కడ తాను మిస్ కమ్యూనికేషన్ చేసుకున్నట్లుగా అనిపించింది అంటు తెలియజేశారు షైన్ టామ్ చాకో. అయితే ఈ విషయాలను తాను స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నానని తెలియజేశారు. మొత్తానికి తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. షైన్ టామ్ చాకో తెలుగులో దసరా, దేవర, తదితర చిత్రాల్లో కూడా నటించి బాగా సుపరిచితమయ్యారు. నటనపరంగా అద్భుతమైన నటుడు అయినప్పటికీ కూడా ఇలాంటివి చేయడం వల్ల ఈయన పేరు చెడిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: