గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రామ్ పోతినేని యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ డేటింగ్ లో ఉన్నారనే విధంగా పలు రకాల రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ కలిసి ప్రస్తుతం మహేష్ బాబు పి డైరెక్షన్లో వస్తున్న ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏవేవో రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ లుక్ పోస్టర్తో కూడా అందరిని ఆకట్టుకోవడంతో అది మరింత నిజమనేలా నమ్మారు. అయితే వీరిద్దరూ డేట్ లో ఉన్నారని సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి.


అంతేకాకుండా వీరిద్దరూ వేరు వేరుగా దిగిన కొన్ని ఫోటోలు బ్యాక్ గ్రౌండ్ కూడా సేమ్ గా ఉందని ఇటీవలే కొన్ని ఫోటోలు వైరల్ గా మారగా ఇందుకు సంబంధించి సోషల్ మీడియాని నేటిజన్స్ కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని విధంగా అభిమానులు కన్ఫామ్ చేసుకున్నారు.. కానీ తాజాగా వీటన్నిటి పైన ఒక నెటిజన్ భాగ్యశ్రీని ఇలా ప్రశ్నించడం జరిగింది. మీ చేతికి ఉన్న ఆ రింగ్ రామ్ తొడిగారా అంటూ ప్రశ్నించగా?.. అందుకు భాగ్యశ్రీ లేదు నేనే కొనుక్కున్నాను అంటూ రిప్లై ఇచ్చింది.


దీంతో ఈ రిప్లై తోనే క్లారిటీ వచ్చేసింది అంటూ పలువురు నెటిజెన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఒకవేళ డేటింగ్ నిజమే అయితే భాగ్యశ్రీ ఇలా రిప్లై ఇస్తుందా సైలెంట్ గా ఉండేది కదా..అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. రూమర్లన్నిటికీ చెక్ పెట్టేలా  ఇలా సమాధానం చెప్పింది అనేటట్టుగా అభిమానులు తెలుపుతున్నారు. ఇక డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో రామ్ సాగర్ పాత్రలో నటిస్తూ ఉండగా భాగ్యశ్రీ మహాలక్ష్మి అనే పాత్రలు నటిస్తోంది ఇందులో కీలకమైన పాత్రలో హీరో రానా కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: