టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రిన్స్ మహేష్ బాబుకు తాజాగా ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన కచ్చితంగా.... విచారణకు హాజరుకావాలని ప్రిన్స్ మహేష్ బాబుకు ఈడి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా... కలకలం చోటుచేసుకుంది. ప్రిన్స్ మహేష్ బాబుకు ఈడి నోటీసులు ఇవ్వడం ఏంటని... ఇండస్ట్రీ పెద్దలు కూడా అవాక్కవుతున్నారు.

 అసలు వివరాల్లోకి వెళితే... టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈడి నోటీసులు ఇవ్వడం వెనుక పెద్ద కథనే ఉంది. సాయి సూర్య డెవలపర్స్ సూరన గ్రూప్ వ్యవహారంలో.... ప్రిన్స్ మహేష్ బాబుకు.... నోటీసులు జారీ అయ్యాయి. గత వారం  దాదాపు రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్ సూరానా గ్రూపులో ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా.... సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్ల రూపాయలను మహేష్ బాబు... నగదు, ట్రాన్స్ఫర్  రూపంలో తీసుకున్నట్లు ఈడి అధికారులు గుర్తించారట.

 ప్రకటనలో నటించేందుకు పెద్ద మొత్తంలో మహేష్ బాబు డబ్బులు తీసుకున్నట్లు కూడా గుర్తించారట అధికారులు. మూడున్నర కోట్ల రూపాయలు నగదు రూపంలో.. తీసుకున్న మహేష్ బాబు 2.5 కోట్ల రూపాయలను ఆర్జిఎస్ ట్రాన్స్ఫర్ ద్వారా... తీసుకున్నట్లు ఈడి అధికారులు గుర్తించినారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలపై.. వివరాలు తెలుసుకునేందుకు తాజాగా హీరో మహేష్ బాబుకు ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు.

 ఈనెల 27వ తేదీన ఖచ్చితంగా తమ విచారణకు హాజరుకావాలని ఈ నోటీసులలో పేర్కొన్నారు అధికారులు. మహేష్ బాబు షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో... ఆయన ఇంట్లో నోటీసులు జారీ చేశారట. అలాగే మహేష్ బాబు వాట్సాప్ నెంబర్ కు కూడా ఈడి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ విచారణకు మహేష్ బాబు హాజరు కాకపోతే... కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ కూడా... ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: