తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది అద్భుతమైన నటులు ఉన్నారు. అలాగే ఎంతో మంది అదిరిపోయే రేంజ్ కలిగిన నటీమణులు కూడా ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన ఓ బ్యూటీ , టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఓ హీరో నటన అంటే ఎంతో ఇష్టం అని అతనితో ఒక్క సినిమా చేసే అవకాశం వచ్చిన బాగుంటుంది అని ఆమె కామెంట్స్ చేసింది. ఇంతకు ఆ నటుడు ఎవరు ..? అలా కామెంట్స్ చేసిన నటి ఎవరు ..? అనేది తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీతో ఈమెకి ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే అద్భుతమైన స్థాయికి చేరుకుంది. తాజాగా పూజా హెగ్డే , సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తుంది. అందులో భాగంగా పూజ హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని అంటే చాలా ఇష్టం అని , ఆయన నటించిన నిన్ను కోరి సినిమాలో అతను అద్భుతమైన నటన కనబరిచాడు అని , నానితో సినిమా అవకాశం వచ్చేస్తే ఖచ్చితంగా చేస్తాను అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. తాజాగా నాని గురించి పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: