
ఇప్పటికే దర్శకుడు అనిల్ రవిపూడి శ్రీకాంత్ ఓదెల తో చిరంజీవి తన తర్వాత సినిమాల ను ఓకే చెప్పాడు .. ఇక ఇప్పుడు మరో కమర్షియల్ డైరెక్టర్ బాబి తో కూడా చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి . ఇప్పటికే ఈ సినిమాకి కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఇక గతంలో బాబీ డైరెక్షన్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తో భారీ విషయం అందుకున్నాడు .. ఇక బాబీ కూడా రీసెంట్ గానే బాలయ్యతో ‘డాకు మహారాజ్’ సినిమాతో భారీ సక్సెస్ కూడా ఇచ్చాడు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ పై మరింత ఆసక్తి నెలకొంది ..
అయితే ఈసారి బాబీ ఓ భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది .. ఇక ఈ సినిమాని ఏకంగా 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నారట .. అలాగే ఈ సినిమా కోసం చిరంజీవి రెమ్యునరేషన్ కూడా 75 కోట్లు అందుకోబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఇప్పుడు ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది .. ఇక చిరు తో బాబీ చేయబోయే సినిమాకు ఇంత భారీ బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరనేది ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు . అయితే ఈ సినిమాను పట్టాలెక్కించే నిర్మాత ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ..