తమన్నా నాగ సాధు పాత్రలో హెబ్బా పటేల్ కీ రోల్ పోషించిన ఓదెల టు సినిమా రీసెంట్ గా విడుదలై బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకి అశోక్ తేజ దర్శకత్వం వహించగా మధు, సంపత్ నందిలు నిర్మాతలుగా చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని పెద్ద ఎత్తున నిర్వహించి సినిమా హిట్ టాక్ ని తెచ్చుకునేలా చేసారు సంపత్ నంది. రీసెంట్ గా సినిమా విడుదలకు ముందు సంపత్ నంది తమన్నాతో కలిసి ఎంతోమంది శివశక్తులను తీసుకువచ్చి పెద్ద కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఈ సినిమాకి భారీ హైప్ పెరిగింది. సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడంతో తాజాగా సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ ని అరేంజ్ చేశారు మూవీ మేకర్స్.

అయితే ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న కొంతమంది విలేకరులు సంపత్ నందిని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశారు. అదేంటంటే..మీరు ఎందుకు మీ సినిమాలో ఎక్కువగా ఫస్ట్ నైట్ సన్నివేశాలను పొలాల గట్ల దగ్గర పెడతారు. మీకు ఏదైనా అనుభవం ఉందా అని ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్న రావడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ సంపత్ నంది నోట్లో నుండి ఎలాంటి ఆన్సర్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసారు.అయితే ఇక సంపత్ నంది  మాట్లాడుతూ.. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. అలాంటి ఫస్ట్ నైట్ సన్నివేశాలను పొలం గట్టు దగ్గర పెట్టడానికి కారణం ఒకటి ఉంది. అదేంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఫేమస్ గా ఉంటుంది.

అలా మా ప్రాంతంలో పొలం గట్టు దగ్గర మంచెలు ఫేమస్.అందుకే నేను సినిమా తీసే సమయంలో ఈ పొలం గట్టు దగ్గర ఉన్న మంచెలపై ఫస్ట్ నైట్ సన్నివేశాలు తీస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన మైండ్ లోకి వచ్చింది. అందుకే సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ పొలం గట్టు మంచె దగ్గర పెట్టాను.అంతేకానీ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అంటూ ఆన్సర్ ఇచ్చారు.. అయితే తమన్నా నాగ సాధు పాత్రలో నటించిన ఓదెల టు మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ త్వరలోనే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనే ఉద్దేశంతో హిట్ టాక్ రావడంతో సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ ని అరేంజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: