హీరోయిన్ మధుబాల అనే పేరు కంటే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా మూవీ హీరోయిన్ మధుబాల అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.మణిరత్నం డైరెక్షన్లో 1992 ఆగస్టు 15వ విడుదలైన రోజా మూవీ దేశవ్యాప్తంగా ఎంత మంచి క్రేజ్ సంపాదించిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఇప్పటికి కూడా ఇండిపెండెన్స్ డే రోజు లేదా రిపబ్లిక్ డే రోజు టీవీలలో వస్తే చాలామంది ఆసక్తిగా చూస్తారు.ఎవర్ గ్రీన్ సినిమాగా ఉన్న రోజా మూవీ హీరోయిన్ మధుబాల కి అప్పట్లో ఈ సినిమా కారణంగా మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమా హీరోయిన్ మధుబాల రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీని బయటపెట్టింది. మధుబాల మాట్లాడుతూ.. మాది లవ్ మ్యారేజ్.. ఆనంద్ షా నన్ను దిల్ సినిమాలో చూసి ఇష్టపడ్డారు. అయితే నేను యాండి బాలరాజ్, జాకీ ష్రాఫ్ తో కలిసి సినిమా చేస్తున్న సమయంలో మా పరిచయం ఏర్పడింది.అయితే అప్పటికే యాండి బాలరాజ్ కి నా భర్తకి మధ్య ఫ్రెండ్షిప్ ఉందట.

 అలా ఓ రోజు వారిద్దరు డిన్నర్ చేసిన సమయంలో నేను ఈ సినిమా చేస్తున్నాను అందులో ఈమె హీరోయిన్ అని చెప్పగానే ఒకసారి నాకు మధుబాల తో మాట్లాడేలా చేయరా అని అడిగారట. దాంతో ఆయనకి నాతో మాట్లాడే అవకాశం వచ్చింది.ఆ తర్వాత ఒక యాడ్ చేయమని అడిగారు. అయితే ఆ యాడ్ విషయం నాకు తెలియదు కానీ నేను యాండి బాలరాజ్ మీద ఉన్న నమ్మకంతోనే యాడ్ చేయడానికి ఓకే చేశాను. యాడ్ కోసం నేను ఆయనతో కలిసి బాలీ కి వెళ్లాను. ఇక బాలీకి వెళ్లడంతోనే మా మధ్య పరిచయం ఏర్పడింది. అలా ఆయన నన్ను ఫ్లర్ట్ చేయాలి అని చూశారు. కానీ నేను మాత్రం ఫ్లర్ట్ అవ్వాలి అనుకోవడం లేదు.ప్రస్తుతం నేను సీరియస్ రిలేషన్షిప్ కోసమే ఎదురు చూస్తున్నాను.ఫ్లర్ట్ చేయడం అనేది నా జీవితంలో ముగిసిపోయింది.ప్రస్తుతం సీరియస్ రిలేషన్ కావాలి అని చెప్పాను. దాంతో ఆయన వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు.

అయితే ఆయన మాటలతో నేను కాస్త కన్ఫ్యూజన్లో మునిగిపోయి ఆ తర్వాత వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. అయితే బాలీ షూటింగ్ నుండి బయటకు వచ్చాక ఇదేంటి నేను ఇంత తొందరగా ఆయనతో పెళ్లికి ఓకే చేశాను అని ఆలోచనలో పడ్డాను. ఆ తర్వాత మా నాన్న నాకు బెంగళూరు బిజినెస్ మాన్ సంబంధం తీసుకోవచ్చారు. దాంతో వెంటనే ఆనంద్ షా తో నాకు ఉన్న ప్రేమని బయట పెట్టాను. అయితే ఈ విషయం నేను చెప్పడంతోనే మా ఆయనకు అండర్ వరల్డ్ తో ఏమైనా సంబంధం ఉందా అని మా నాన్న అనుమానపడ్డారు.కానీ ఆ తర్వాత ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఆయనకిచ్చి నన్ను పెళ్లి చేశారు.అలా మా పెళ్లి జరిగింది అంటూ సింగపూర్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ షా తన ప్రేమ పెళ్లి గురించి రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ మధుబాల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: