
సినిమా విజువల్ ఎఫెక్ట్ ,గ్రాఫిక్స్ , చిరంజీవి లుక్స్ అన్ని చూశాక నెగెటివిటీ ఎక్కువగా వినిపించింది. దీంతో చిత్ర బృందం కూడా అలర్ట్ అయ్యి కంటెంట్ అంతా పక్కన పెట్టి మరి కొత్తగా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విధంగా వార్తలు వినిపించాయి. అందుకే ఈ సినిమా విడుదల సమయాన్ని కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని నెలల పాటు అసలు విశ్వంభర సినిమా పేరే ఎక్కడ వినిపించలేదు. అలాంటిది ఇప్పుడు తాజాగా మళ్లీ ప్రేక్షకులు దృష్టికి తీసుకురావడానికి చిత్రబృందం కూడా హైప్ తీసుకువస్తున్నారు.
ఇందులో భాగంగానే మొదటి పాటను చిత్ర బృందం రిలీజ్ చేయగా పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ బడ్జెట్ గురించి కూడా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.సుమారుగా రూ .75 కోట్ల రూపాయలకు గ్రాఫిక్స్ పనులకే ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి, కల్కి సినిమాల తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువ అవ్వడమే కాకుండా హాలీవుడ్ రేంజ్ లో తీసేలా గ్రాఫిక్స్ చేస్తూ ఉన్నారు. అయితే వినిపిస్తున్న సమాచారం మేరకు విఎఫ్ఎక్స్ గతంలో చేసిన వాటిని పక్కన పెట్టి మరి వర్క్ చేశారని అందుకే బడ్జెట్ పెరిగిపోయిందని రూమర్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి 75 కోట్ల విఎఫ్ఎక్స్ బడ్జెట్ అనే వార్త ఈ సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తోందట.