ఈ మధ్య కాలంలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ హీరోలు కూడా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్ లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం రోజు రోజుకి ఓ టి టి కంటెంట్ను వీక్షించే జనాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ లో కనిపించిన కూడా అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉండడంతో చాలా మంది సూపర్ క్రేజ్ ఉన్న నటీ నటులు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఓ బాలీవుడ్ స్టార్ నటుడు ఓ వెబ్ సిరీస్ లో నటించినందుకు ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు 18 కోట్ల చొప్పున 7 ఎపిసోడ్లకు గాను దాదాపు 125 కోట్ల వరకు పారితోషకాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. మరి అంత స్థాయిలో పారితోషకాన్ని పుచ్చుకున్న ఆ నటుడు ఎవరు ..? ఏ వెబ్ సిరీస్ కు గాను ఆయన అంత పారితోషకాన్ని ఆయన పుచ్చుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగి నటులలో అజయ్ దేవగన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే అజయ్ దేవగన్ కొంత కాలం క్రితం రుద్ర – ది ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్ దేవగన్ ఈ వెబ్ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు 18 కోట్ల పారితోషకం పుచ్చుకున్నట్లు , మొత్తంగా 7 ఎపిసోడ్లకు గాను 125 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad