
ఎందుకంటే ఈ టీజర్లో చూపించిన గ్రాఫిక్స్ చాలా వరస్ట్ గా ఉందని.. సరిగ్గా చేయలేదని రూమర్స్ కూడా వినిపించాయి. చాలామంది మెగా అభిమానులే నిరుత్సాహపడ్డారు. దీంతో అటు చిరంజీవి కూడా కొంతమేరకు అసహనంతో డైరెక్టర్ వశిష్ట కు కూడా నచ్చచెప్పి మరి తిరిగి రీ గ్రాఫిక్స్ చేశారనే విధంగా వార్తలు కూడా వినిపించాయి. అందుకే ఇటీవలే హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన పాటలో గ్రాఫిక్స్ కొంతమేరకు బాగానే ఆకట్టుకున్నది. విశ్వంభర సినిమా విజువల్ ఎఫెక్ట్ గా తెరకెక్కించే విధంగా డైరెక్టర్ వశిష్ట ప్లాన్ చేస్తున్నారు.
అయితే విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం చిత్ర బృందం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. సోసియో ఫాంటసీ కావడం చేత ఇందులోని కొన్ని సన్నివేశాలు న్యాచురల్ గా చూపించాల్సింది పోయి ఇవి గ్రాఫిక్స్ అనేటట్టుగానే కనిపిస్తున్నాయి. 75 కోట్ల రూపాయలు ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్లు రెండు రోజుల నుంచి టాక్ అయితే వినిపిస్తోంది కానీ అన్ని కోట్లు బడ్జెట్ లు పెట్టిన గ్రాఫిక్స్ విషయంలో మాత్రం నిరాశగానే అభిమానులను ఉంచుతోంది విశ్వంభర టీమ్. ఈ గ్రాఫిక్స్ విశ్వంభర సినిమాకి కూడా మైనస్ గా మారుతున్నది.. మరి సినిమా విడుదల సమయానికి బజ్ క్రియేట్ చేసుకుని ట్రైలర్ తో సరికొత్తగా కనిపిస్తారేమో చూడాలి..