సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా క్యాస్టింగ్ కౌచ్  గురించి మాట్లాడారు. అలా ధైర్యంగా కూడా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కూడా తమకు జరిగిన కొన్ని చేదు అనుభవాలను లైంగిక వేధింపుల గురించి డైరెక్ట్ గానే చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా తెలియజేస్తూ ఉన్నారు.యంగ్ హీరోయిన్స్ నుంచి సీనియర్ హీరోయిన్ వరకు వీటి పైన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్య బాలన్ ఒక నిర్మాత తనని అవమానించారని దీనివల్ల ఆరు నెలల పాటు తాను నరకాన్ని అనుభవించాను అంటూ తెలియజేస్తోంది. వాటి గురించి పూర్తిగా చూద్దాం.



బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. డర్టీ పిక్చర్ అనే చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని సుపరిచితురాలు అయ్యింది. ఈమె నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత బాలయ్యతో మహానాయకుడు సినిమాలో కూడా నటించింది. తర్వాత బాలీవుడ్ లో బిజీగా ఉంటూ పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది. తాజాగా విద్యాబాలన్ చేసిన కొన్ని కామెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉన్నాయి.


ఒక నిర్మాత తనను చాలా అవమానించారని.. తన దగ్గరకు వచ్చి చాలా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వెల్లడించింది. తనని చాలా చండాలంగా కూడా పిలిచేవారని ఆ మాటలు తనని చాలా బాధపెట్టాయని ఆ అవమానంతో తాను ఆరు మాసాల వరకు తన ముఖాన్ని కూడా అద్దంలో చూసుకోలేనంతగా మాట్లాడారని తెలియజేసింది. ఆ నిర్మాత అన్న మాటలకు తాను మనిషిని కాలేకపోయానని ఇలాంటి సంఘటనలు తన కెరీర్లో చాలానే జరిగాయని ముఖ్యంగా బాడీ షేవింగ్ అయితే చాలా మంది తనని కావాలని అనే వారిని తెలిపింది. మలయాళ ఇండస్ట్రీలో నుంచి ఒక సినిమా ఆఫర్ రాగ అది మధ్యలో ఆగిపోయింది. దీంతో తనని దురదృష్టవంతురాలని కూడా హేళన చేశారు. సినిమా కొన్ని కారణాల చేత ఆగిపోతే తను కారణమా అంటూ విద్యాబాలన్ ఎమోషనల్ గా మాట్లాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: