టాలీవుడ్ హాట్ లేడీ, అలనాటి అందాల తార రంభ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాలేదు. కోలీవుడ్లో సైతం స్టార్ గా కొనసాగిన ఘనత రంభది కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి అని మీలో ఎంతమందికి తెలుసు? ఆమె సినిమాలలోకి అడుగు పెట్టాక స్క్రీన్ నేమ్ గా రంభగా మార్చుకుంది. అప్పట్లో దాదాపు అందరు టాప్ హీరోలతో ఆమె నటించడం వల్లనే జనాల్లో బాగా పాపులారిటీ పెరిగింది అని చెప్పుకోవచ్చు.

ఆమె చివరగా చేసిన సినిమా 'దేశముదురు.' సదరు సినిమాలో ఆమె ఐటెం సాంగ్ లో కనిపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కెనడాలోనే పూర్తిగా సెటిల్ అయిపోయింది. తాజాగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఓ టీవీ షోలో జడ్జ్ గా కనిపించింది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పెళ్లి తర్వాత తాను కెనడాలో స్థిరపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక తల్లిగా పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని... అందుకే సినిమాలకు దూరమయ్యానని చెప్పింది.

కాగా ఆమెకి ప్రస్తుతం ఆరేళ్ల బాబు, 14, 10 ఏళ్లు ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి తన భర్తకు తెలుసని, అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తానంటే ఆయన సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చింది. ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా చేశానని... ఆ షో చేయడానికి తొలుత భయపడ్డానని... కానీ, అంతా హ్యాపీగా జరిగిపోయిందని రంభ ఈ సందర్భంగా తెలిపింది. ప్రేక్షకుల చప్పట్లు తనలో ఉత్సాహాన్ని నింపాయని చెప్పింది. తాను మళ్లీ నటించడానికి రెడీగా ఉన్నానని తెలిపింది. తనతో కలిసి నటించిన చాలా మంది ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారని... వారి సహకారం కూడా తనకు ఉంటుందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: