టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న క్రిష్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ లిస్టులో తన పేరు ఉంటుందని చెప్పవచ్చు. అయితే తను తీసే ప్రతి కథలో కూడా సరికొత్త పాయింట్ తో అటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీస్తూ ఉంటారు. తక్కువ బడ్జెట్ తోనే అతి తక్కువ సమయంలోనే సినిమాలను పూర్తి చేయగలిగిన స్టామినా ఉన్న డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు. గమ్యం, వేదం, కంచె తదితర చిత్రాలను కూడా తెరకెక్కించిన క్రిష్  ఈ మధ్య తన సినిమాలు సరిగ్గా కనెక్ట్ కాలేదు.


డైరెక్టర్ గానే కాకుండా కంటెంట్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమాల ఫలితాలు మాత్రం పెద్దగా ఆశించిన స్థాయిలో లేదు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఈయన సినిమాలు సరిగ్గా లేవని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించిన సరైన ఫలితం లభించలేదు. ఇక తర్వాత బాలీవుడ్ లో చేసిన మణికర్ణిక సినిమా చివరి వరకు వచ్చి మరి హీరోయిన్ తో విభేదాలు కారణంచేత వదిలేశారు.


ఇక పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన హరిహర వీరమల్లు సినిమా కూడా ఏం జరిగిందో తెలియదు కానీ చివరిలో వదిలేశారు. ఇదంతా చూస్తూ ఉంటే డైరెక్టర్ క్రిష్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డేట్లు ల అడ్జస్ట్ కాక కొన్ని నెలలపాటు వెయిట్ చేసిన నిరుత్సాహమే మిగిలింది. దీంతో అనుష్క శెట్టితో ఘాటి సినిమాని కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్ 18న విడుదల అవుతుందంటూ ప్రకటించిన ఇప్పుడు ఆ డేట్ కి కూడా రిలీజ్ కాలేదు.


షూటింగ్ ముగిసిందా లేకపోతే ఏంటి అన్న పరిస్థితి అసలు చెప్పలేదు. డైరెక్టర్ క్రిష్ తాను ఎంచుకున్న కథలలో తడబడుతున్నారా? ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయం తెలియాలి. మరి అనుష్క సినిమాతో నైనా అన్ని చెక్క పెట్టుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: