
అయితే, 'N.T.R: కథానాయకుడు', 'N.T.R: మహానాయకుడు' సినిమాలు తీసిన తర్వాత పరిస్థితి మారింది. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో క్రిష్ పేరు బాగా డ్యామేజ్ అయింది. ఆ ఫెయిల్యూర్ తర్వాత ఆయన కెరీర్‌లో ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. మళ్లీ ఆయన పేరు వార్తల్లోకి ఎక్కింది 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'తో 'హరిహర వీరమల్లు' అనే భారీ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడే. ఈ సినిమాతో క్రిష్ పాత ఫామ్‌లోకి వస్తారని అభిమానులు గట్టిగా నమ్మారు.
దురదృష్టవశాత్తు, 'హరిహర వీరమల్లు' అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకుడిగా వచ్చారు. కానీ, కొత్త డైరెక్టర్ వచ్చినా కూడా సినిమా పనులు వేగవంతం కాలేదు. 'వీరమల్లు' భవిష్యత్తు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.
ఇదే సమయంలో, క్రిష్ 'అనుష్క శెట్టి'తో కలిసి 'ఘాటి' అనే కొత్త సినిమా మొదలుపెట్టారు. 'ఘాటి' ఫస్ట్ లుక్స్, ప్రోమోలు చాలా ప్రామిసింగ్‌గా కనిపించాయి. తన పాత పద్ధతిలో ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని క్రిష్ ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ 18న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ, ఆ తేదీ దగ్గర పడుతున్నా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. సినిమా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అసలు షూటింగ్ అయిందా లేదా, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు.
'వీరమల్లు', 'ఘాటి' రెండూ ముందుకు కదలకపోవడంతో, క్రిష్ కెరీర్ ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. క్రిష్ ప్రతిభను నమ్మే ఆయన అభిమానులు చాలా నిరాశతో ఉన్నారు. 'ఘాటి' సినిమాపై ఒక అప్‌డేట్ వస్తే బాగుండు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాతోనైనా క్రిష్ మళ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు.