
ఆ తర్వాత వివాహమై పిల్లలు పుట్టడంతో సినిమాలకు దూరమైంది. ఈ మధ్యకాలంలో మళ్లీ రీ యంట్రి ఇవ్వడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా అక్క, వదిన, తల్లి వంటి పాత్రలు కూడా తాను చేయడానికి సిద్ధమే అంటూ తెలియజేస్తోంది. ఇటీవలే ఒక టీవీ షోకు జడ్జిగా వ్యవహరించిన రంభ తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడడం జరిగింది. పెళ్లి తర్వాత తను కెనడాలో స్థిరపడిపోయారని అక్కడే కుటుంబం పిల్లల కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోయాను అంటూ తెలిపింది.
అయితే తన పిల్లలు ఒక వయసు వచ్చేసరికి వారికి తల్లిగా బాధ్యత తెలుసుకున్నారని.. ఇప్పుడు తన కొడుక్కి ఆరేళ్లు అమ్మాయికి 14 ఏళ్ళు ప్రస్తుతం ఎవరి పనులు వారే చూసుకుంటున్నారని దీంతో తాను ఇకమీదట సినిమాలు మీద ఫోకస్ పెట్టబోతున్నానని..తన భర్త కూడా తనకు సినిమాల గురించి ఆసక్తి ఉందని తెలిసి మళ్ళీ నటింప చేయడానికి ఒప్పుకున్నారని ముందుగా ఒక డాన్స్ షోకి జడ్జిగా చేశాను.. ఆ సమయంలో తాను చాలా భయపడ్డానని కానీ షో సాఫీగా సాగిపోయింది.. ప్రేక్షకులు కూడా తన జడ్జిమెంట్ కి చప్పట్లు కొట్టడంతో తనకి మళ్ళీ ఉత్సాహాన్ని నింపాయి అంటూ తెలిపింది.