చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ డైరెక్టర్ కి లేనంత అయోమయ పరిస్థితుల్లో త్రివిక్రమ్ ఉన్నాడు .. మహేష్ తో గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ సినిమా ఏది మొదలుపెట్టలేదు .. అలా అని గురూజీ ఖాళీగా కూడా లేడు .. అల్లు అర్జున్ సినిమా కోసం ఒక కథ రెడీ చేశారు .. అయితే అట్లీ వచ్చి గురూజీ ప్లాన్ కు కొంత బ్రేకులు వేశాడు .. బన్నీ , అట్లీ సినిమా  ఫుల్ స్పీడ్‌లో రావటంతో త్రివిక్రమ్‌ స్లో అవ్వాల్సి వచ్చింది .. ముందుగా అట్లీ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మధ్యలో త్రివిక్రమ్ మరో సినిమా చేయాలన్న ఆలోచనలో కూడా వెళ్లాడు .  వెంకటేష్ , రామ్ , ధనుష్ , శివ కార్తికేయన్ ఇలా చాలా పేర్లు వచ్చాయి.


 వాళ్లకు తగిన కథలు కూడా రెడీ అయ్యాయి .. శివ కార్తికేయ‌న్ తో సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి .. కానీ జూన్ , జూలై నుంచి శివ కార్తికేయన్ డేట్లు ఇస్తాడని టాక్ కూడా బయటకు వచ్చింది . అయితే త్రివిక్రమ్ ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నాడు .. అట్లి తో పాటు త్రివిక్రమ్ సినిమాని కూడా సమాంతరంగా పూర్తి చేస్తానని బన్నీ మాటా ఇచ్చాడట .. అయితే అది వర్కౌట్ అవుతుందా లేదా ? అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు .. అలాగే డేట్లు ఎడ్జస్ట్ చేస్తే ఎలా చేస్తాడు ? లుక్‌ పరంగా ఇబ్బంది రాదా ? ఇలా ఎన్నో సందేహాలు ఆయన మదిని తొలిచేస్తున్నాయి .. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ కి చాలా గ్యాప్ వచ్చింది .. బన్నీ కోసమే ఇంకా వెయిటింగ్ లో ఉండిపోయాడు ..


అయితే ఇప్పుడు అట్లీ సినిమా కంప్లీట్ అయ్యేలోపు త్రివిక్రమ్ మ‌రో సినిమాను పూర్తి చేస్తే .. పారితోషికం రూపంలో కూడా కనీసం 40 కోట్లు అందుకోవచ్చు .. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మరింత ఎదురు చూస్తే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో అనేది అంచనా వేయటం కూడా కష్టమే .. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ ను ఎలాగైనా ఒప్పించి శివ కార్తికేయ‌న్  సినిమాని ముందుకు తీసుకు వెళ్ళటమే బెటర్ అని ఆప్షన్ లో త్రివిక్రమ్ ఉన్నాడు .  ఇక ఈ వారంలో బన్నీతో ఓ మీటింగ్ కూడా ఉండొచ్చని అంటున్నారు . దీని బట్టి త్రివిక్రమ్ ఎలా ముందుకు వెళ్లాలని విషయంలో కూడా ఓ క్లారిటీ రానుంది. అప్పటివరకు ఈ అయోమయ పరిస్థితి ఇలానే ఉంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: