గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్ గేమ్ చేంజర్‌ లాంటి సినిమా తర్వాత ఈ మెగా హీరో ఎలాంటి సినిమాతో వస్తాడని చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు .. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకులను అసలు మెప్పించలేకపోయింది .. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది .. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది సినిమాతో చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ..  సినిమాను డైరెక్టర్ బుచ్చిబాబు తెర్కక్కిస్తున్నాడు . ఉప్పెన మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు పెద్ది సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు .. చరణ్ కెరీర్ లోనే ఇది 16వ సినిమా .. ఈ సినిమా నుంచి రీసెంట్ గానే టైటిల్ తో పాటు వీడియో గ్లింమ్స్ ను కూడా రిలీజ్ చేశారు ..
 

ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు .. అలాగే  ఇండియన్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు .  వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .. ఇటీవల యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరిగినట్లు కూడా తెలుస్తుంది .. రీసెంట్ గానే శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్‌ను  పొగడ్తలతో ముంచెత్తారు .. తన పాత్రను ఎంతో స్పెషల్ గా ఉంటుందని కూడా చెప్పకు వచ్చాడు .. అలాగే ఈ  సినిమాలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్లో నటిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు ..

 

ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి .. రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు ఈ సినిమా గురించి దర్శకుడు బుచ్చిబాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు .  అలాగే రీసెంట్గా విడుదల చేసిన గ్లింమ్స్‌లో చివర్లో క్రికెట్ షేర్ షాట్ ఒకటి ఎంతో హైలెట్గా మారింది .. ఈ షార్ట్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ .. నేనెప్పుడూ రూటేడ్ స్టోరీలనే చెప్పాలనుకుంటా .. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆ షార్ట్ ను డిజైన్ చేశారని అతడికి ఈ క్రెడిట్ దక్కుతుందని ఆయన అన్నారు ..   బుచ్చిబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: