
ప్రజెంట్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు ఇంట్రెస్టింగ్ క్రేజీ సినిమా లు తెరకెక్కుతున్నాయి .. ఇక ఇందులో కొన్ని సినిమా లు ఈ సమ్మర్ కనకగా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి .. ఇంకా మరి కొన్ని సినిమాలు ఈ సమ్మర్ తర్వాత రిలీజ్ కు రాబోతున్నాయి .. అయితే ఇప్పుడు వచ్చే జూలై నెలలో చాలా వరకు పెద్ద హీరోలు తమ సినిమాల ను రిలీజ్ చేయమన్నారు .. అయితే ఈసారి వచ్చే జూలై నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమా లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి .. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర భారీ గ్రాఫిక్స్ తో రాబోతుంది ...
ఇక ఈ భారీ బడ్జెట్ సినిమా ని జులై 24 న రిలీజ్ చేసేందుకు చిత్ర యుగం రెడీ అవుతుంది .. అయితే భోళా శంకర్ ప్లాప్ తర్వాత చిరంజీవి ఈ సినిమా తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు .. అటు మాస్ మహారాజా రవితేజ కూడా తన తాజా మూవీ మాస్ జాతర ను జులై 18న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు .. ప్రస్తుతం వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న రవితేజ కూడా ఈ సినిమా తో గట్టి కం బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు .. ఇక మరో యంగ్ హీరో నితిన్ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లతో తన తర్వాత మూవీ తమ్ముడు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఇక ఈ సినిమా ను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా జులై 4న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది .. ఇలా ఈ ముగ్గురు హీరోలు వచ్చే జూలై లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో అనేది అందరిలో కొంత హాట్ టాపిక్ గా మారింది ..