ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీమణుల్లో  జయలలిత కూడా ఒకరు.. చాలామందికి జయలలిత పేరు చెప్పగానే తమిళనాడు జయలలిత అనుకుంటారు. కానీ తెలుగులో కూడా జయలలిత పేరుతో నటి ఉందని చాలామందికి తెలియదు. అంటే ఆ నటి తెలుసు కానీ ఆమె పేరు జయలలిత అని చాలామందికి తెలియదు. అలాంటి జయలలిత తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అయిపోయింది. ముఖ్యంగా ఈమె వ్యాంపు పాత్రల్లో  అద్భుతంగా నటించేది. అలాంటి జయలలిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. 

ముఖ్యంగా ఆమెకు సీనియర్ నటుడు శరత్ బాబుకు ఉన్నటువంటి పరిచయం గురించి కూడా ఆమె తెలియజేసింది.. దివంగత శరత్ బాబు  మరో సీనియర్ నటి అయిన రమ ప్రభతో రిలేషన్ లో ఉండేవారు. కానీ ఆయనతో నాకు కూడా మంచి సంబంధం ఉందని జయలలిత చెప్పుకొచ్చింది. ఆయనతో నేను ఎన్నో యాత్రలు చేశానని, నా జీవితంలో శరత్ బాబుతో తిరిగిన ఎన్నో క్షణాలు ఇప్పటికి గుర్తుంటాయని తెలియజేశారు. ఆయనతో యాత్రలు చేసిన సమయంలోనే ఆయన మనస్తత్వం ఏంటో అర్థం చేసుకున్నానని, శరత్ బాబు ఒకరి రూపాయి తినరని, మరొకరికి ఆయన పెట్టారని తెలియజేశారు. నాకు తెలిసినంతవరకు ఆయన ఒక గొప్ప మనిషి అంటూ కొనియాడారు.

 ఒకానొక సమయంలో శరత్ బాబును నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కణాలనుకున్నానని అన్నారు. ఈ విషయాన్ని ఆయనతో చెప్తే మనకు అలాంటిది ఏమీ వద్దు. మనం పిల్లల్ని అంటే మనం చనిపోయిన తర్వాత మన సంతానాన్ని ఎవరైనా చంపేస్తానని ఆయన అన్నారు. అప్పట్లో శరత్ బాబు కుటుంబంతో నాకు మంచి రిలేషన్ ఉందని ఒక ఫ్యామిలీ మెంబర్ గా నన్ను చూసేవారిని చెప్పుకొచ్చింది. అంతేకాదు  ఆయనను నేను భావ అని పిలిచే దాన్ని, ఈ విధంగా మా మధ్య మంచి సన్నిహిత్యం ఉండేదని చెప్పుకొచ్చింది. ఈ విధంగా జయలలిత శరత్ బాబుతో ఉన్న రిలేషన్స్ గురించి చెప్పడంతో  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: