
ప్రస్థుతం వరస హిట్స్ తో దూసుకుపోతున్న బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈసినిమాను పాన్ ఇండియా స్తాలో విడుదల చేయాలని భావిస్తున్నారు. బోయపాటి ఈమూవీ మేకింగ్ లో చాల శ్రద్ద పట్టడంతో పాటు ఈమూవీలో విపరీతమైన గ్రాఫిక్స్ ఉండటంతో ఈ మూవీ నిర్మాణ పనులు చాల నెమ్మదిగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో ఈమూవీని ముందుగా అనూన్నట్లుగా ఈ సంవత్సరం దసరా రేస్ కు కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ లో ఈమూవీని విడుదల చేయాలని బోయపాటి ఆలోచన అన్న లీకులు వస్తున్నాయి. దీనికితోడు సెంటిమెంట్ పరంగా బాలకృష్ణ కు సంక్రాంతి బాగా కలిసి వస్తుంది కాబట్టి అన్నివిదాల ఈమూవీ విడుదలకు సంక్రాంతి కలిసి వస్తుందని బోయపాటి ఆలోచన అని అంటున్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే వరస హిట్స్ తో దూసుకు పోతున్న అనీల్ రావిపూడి చిరంజీవితో తీస్తున్న మూవీని కూడ అనీల్ రావిపూడికి కలిసి వచ్చిన సంక్రాంతి సెంటిమెంట్ తో వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని అనీల్ రావిపూడి గట్టి పట్టుదలతో ఉండటమే కాకుండా తన మూవీ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ కూడ వచ్చే సంక్రాంతికి విదుల కాబోతున్న పరిస్థితులలో రాబోతున్న సంక్రాంతి రేస్ విజేత ఎవరు అన్న ఆశక్తి అందరిలోను ఉంది..