
అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి - చిరంజీవి సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోయే హీరోయిన్ కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఊర్వశి రౌతేలా..ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరవబోతుందట . ఊర్వశి రౌతేలా - చిరంజీవిల బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే . వీళ్ళ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ క్రమంలోనే వీళ్ల కాంబో మరొకసారి రిపీట్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పాలి . .
ఊర్వశి రౌతేలా పేరు ఈ మధ్య కాలంలో చాలా చాలా వైరల్ అయ్యింది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఎవరిని నటింపజేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు చిరంజీవినే ముందుగా ఊర్వశి రౌతేల పేరు సజెస్ట్ చేశారట . ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి చిరంజీవి ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాతో చాలాకాలం తర్వాత బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నాడని అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???