టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రోజు రోజుకి కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉన్నారు. కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధిస్తారు. మరికొంతమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి సినిమాలోకి వచ్చి సక్సెస్ అందుకుంటారు. అలాంటి వారిలో నటి ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈ చిన్నది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదివరకే ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది ఈ మధ్య కాలంలోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది.

రీసెంట్ గా ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. తన నటన, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ చిన్నది వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేతిలో పలు సినిమా ప్రాజెక్టులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇదిలా ఉండగా.... సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్లను రాబట్టింది. 

ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.... వెంకటేష్ హీరోగా నటించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా థియేటర్లలో రిలీజ్ అయ్యి మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరోసారి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఈ బ్యూటీతో పాటు మరో హీరోయిన్ ను కూడా పెట్టి సినిమా తీయనున్నారట. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: