- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

సినిమా పబ్లిసిటీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. అనిల్ రావిపూడి అనే దర్శకుడు సినిమా ప్రమోషన్స్ ను కొత్త ట్రెంట్ సెట్ చేసాడు. ఇప్పుడు అందరు అదే దారిలో వెలుతున్నారు. మరికొందరు సినిమా టికెట్స్ ను  ఫ్రీ గా ఇస్తూ తమ సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా చౌర్య పాఠం  అనే సినిమా మేకర్స్ మరో కొత్త ట్రెండ్ కు తెరలేపారు. ప్రస్తుతం ఇండియా మొత్తం ఐపీల్ ట్రెండ్ నడుస్తోంది. దాన్ని పసిగట్టిన మేకర్స్ ఐపీఎల్ టికెట్స్ ను ఉచితంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 23న హైదరాబాద్ లోని ఉప్పల్ వెదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు చౌర్యపాఠం మేకర్స్ ఐపీఎల్ టికెట్స్ ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కానీ టికెట్స్ గెలవాలంటే చిన్నపాటి కాంటెస్ట్ నిర్వహించారు.


యంగ్ హీరో ఇంద్రరామ్ నటించిన ఈ సినిమాను ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మించారు.  కన్నడ భామ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. నిఖిల్ గొల్లమారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను వీక్షించి అందుకు సంబంధించి మేకర్స్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెబితే విన్నర్స్ లోని కొందరిని విజేతలుగా ప్రకటిస్తూ వారికీ ఐపీఎల్ టికెట్స్ ఇవ్వనున్నారు. ఏదేమైనా సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని చిత్రాలు చూడాలో . ..!

మరింత సమాచారం తెలుసుకోండి: