బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి జాన్వీ కపూర్ ఒకరు. శ్రీదేవి వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది 'దడక్' అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ కపూర్ సినిమాలలో అవకాశాలను అందుకున్నప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ చిన్నది తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

 దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో తన హవాను కొనసాగిస్తోంది. తన నటన, అందంతో ప్రేక్షకుల మనసులను పోగొడుతోంది. దేవర సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న పెద్ది సినిమాలో ఈ చిన్నది హీరోయిన్ గా చేస్తోంది. తెలుగు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ లోనూ అనేక సినిమాలలో నటిస్తూ తన హవాను కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ''పరమ్ సుందరి" అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు.

 ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే తాజాగా హీరో సిద్ధార్థ్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్కూటీని నేర్పిస్తుండగా ఈ బ్యూటీ ట్రయల్ చేసింది. ఇది సినిమా షూటింగ్ లో భాగమా లేకపోతే వీరిద్దరూ సాధారణంగానే స్కూటీని జాన్వి నేర్చుకుంటుందా అనే సందేహాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.... జాన్వి కపూర్ అభిమానులు కాస్త సీరియస్ అవుతున్నారు. చాలామంది ఈ వీడియోను చూసి నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల పైన జాన్వీ కపూర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: