- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై  చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’.   చిమటా  జ్యోతిర్మయి  (యు.ఎస్.ఏ)  సమర్పణలో, చిమటా లక్ష్మీ కుమారి  నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.  99 రూపాయల రెంట్‌తో   స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంది. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్ ,కామెడీ, హర్రర్ తో పాటు అన్ని ఎలిమెంట్స్‌తో మల్టీ జానర్  మూవీగా చిమటా  రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) ఈ చిత్రాన్ని రూపొందించారు.


విలేజ్ బ్యాక్‌డ్రాప్ కావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. జానీ పాత్రలో రమేష్ బాబు నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. జానీ అన్యాయాలను ఎదురించే యువకుడిగా, అపాదలో ఉన్న వారికి సాయం చేసే వ్యక్తిగా నటించారు. అయితే ఓ విషయంలో తను శత్రువులతో పోరాడాల్సి వస్తుంది. అదే టైమ్‌లో జానీ లైఫ్‌లోకి కీర్తన వస్తుంది. ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారుతుంది. కీర్తన ప్రమాదంలో ఉన్న విషయం జానీకి తెలుస్తుంది. ఆ ప్రమాదం నుంచి కీర్తను జానీ ఎలా బయటకు తీసుకువచ్చాడనేది చాలా ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  కుల్లు మనాలిలో చిత్రీకరించిన పాత్రలు , యాక్షన్ ఎపిసోడ్స్  హైలైట్ గా ఉన్నాయి.   ఊహించని మలుపులతో కథను హర్రర్ వైపుకు తీసుకెళ్ళాడు దర్శకుడు.    రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. రేణు ప్రియా, సంధ్య, జీవా, విజయ్ రంగరాజ్, జబర్ధస్త్ అప్పారావు, జబర్ధస్త్ సన్నీ తదితరలు ఇతర పాత్రల్లో మెప్పించారు.  ఈ చిత్రం  ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.  బుక్‌మైషోలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: