
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్
సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.. ఎప్పుడు షూటింగ్ అప్‌డేట్స్ వస్తాయి.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని అభిమానులు ఒక్కటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవగా.. ఎన్టీఆర్ తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో నే కర్ణాటకలోని మంగళూరులో ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన పోర్ట్ సెట్‌లో ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణంపై దర్శకుడు నీల్ కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ నాలుగు రోజుల పాటు జరగనుందని సమాచారం. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇక రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా .. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనుందట.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.