టాలీవుడ్ ఇండస్ట్రీ, మల్లూవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో షైన్ టామ్ చాకో ఒకరు. ప్రముఖ నటి విన్సీ సోనీకి షైన్ టామ్ చాకో క్షమాపణలు చెప్పినట్టు సమాచారం అందుతోంది. తాను ఉద్దేశపూర్వంగా ఏ తప్పు చేయలేదని ఈ చర్యల వల్ల ఆమె ఇబ్బంది పడినందుకు సారీ చెప్పినట్టు షైన్ టామ్ చాకో చెప్పినట్టు సమాచారం అందుతోంది.
 
ఇకపై సెట్స్ లో అందరితో మంచిగా ప్రవర్తిస్తానని షైన్ టామ్ చాకో చెప్పారని భోగట్టా. కమిటీ తీసుకునే నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానని చెప్పినట్టు ఆ నిర్ణయం ఆధారంగా అమ్మ, ఫిల్మ్ ఛాంబర్ తగిన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం అందుతోంది. ఆ సమావేశానికి విన్సీ ఒక్కరు మాత్రమే హాజరు కాగా షైన్ కుటుంబంతో కలిసి వెళ్లారని సమాచారం అందుతోంది.
 
కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో విన్సీ ఒక మూవీ షూట్ సమయంలో షైన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. తాను ఎదుర్కొన్న ఇబ్బంది గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఆ నటుడి పేరును బయటపెట్టకూడదని విన్సీ కోరినా అందుకు భిన్నంగా జరిగింది. మారిన పరిణామాల నేపథ్యంలో షైన్ టామ్ చాకోపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని తాను కోరుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
 
సినిమా ఇండస్ట్రీలో ఎదురైన సమస్యకు ఇండస్ట్రీలోనే పరిష్కారం లభించాలని ఆమె కోరారు. మరోవైపు డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో షైన్ చాకో టామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం షైన్ టామ్ చాకో బెయిల్ పై రావడం గమనార్హం. షైన్ టామ్ చాకో భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. షైన్ టామ్ చాకో రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది. షైన్ టామ్ చాకో తన కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షైన్ టామ్ చాకోను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: