తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో ఒకరు అయినటువంటి హెబ్బా పటేల్ కొంత కాలం క్రితం ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నేరుగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ మూవీ ఓ టి టి లోకి వచ్చాక కొంత కాలానికి ఈ సినిమాకు కొనసాగింపుగా ఓదెలా 2 అనే మూవీ ని రూపొందించనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఓదెల 2 మూవీ లో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఓదెల 2 మూవీ మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 17 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రాని కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 92 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 35 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.14 కోట కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 4 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.41 కోట్ల షేర్ ... 4.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 4 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కలుపుకొని 36 లక్షల కలెక్షన్ దక్కాయి. నాలుగు రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2.75 కోట్ల షేర్ ... 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగగా ... మరో 8.2 కోట్ల రేంజ్ లో ఈ సినిమా షేర్ కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: