
థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. నాని ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలో ఆయన కొత్తగా సాల్ట్-అండ్-పెప్పర్ లుక్‌లో కనిపిస్తుండటం గమనార్హం. ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అర్జున్ సర్కార్ అనే పోలీసు అధికారి పాత్రలో నాని క్రమశిక్షణతో కూడిన, కానీ కొంత క్రూరతను కూడా ప్రదర్శించే పోలీసు అధికారి పాత్రలో కనిపించనుండటం గమనార్హం. ఈ సినిమా హిట్ ఫ్రాంచైజీలో మూడవ భాగంగా తెరకెక్కుతోంది. శ్రీనిధి శెట్టి కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడుతూ రివ్యూల విషయంలో ఎవరినీ ఆపలేరని నాని తెలిపారు. నాకు నచ్చలేదని చెప్పడానికి ఓకే కానీ ఈ సినిమా ఆడదని చెప్పొద్దని ఆయన అన్నారు. నాని మాట్లాడుతూ సినిమా డిజాస్టర్ అని ఒక్కరోజులో ఎలా చెబుతారని సినిమా రిలీజై పది రోజులైనా ఎవరూ చూడకపోతే అప్పుడు డిజాస్టర్ అని చెప్పాలని న్యాచురల్ స్టార్ నాని వెల్లడించారు.
పర్సనల్ గా సినిమా గురించి ఒపీనియన్ ఎలా చెప్పినా ఓకే అని నాని అన్నారు. కానీ మీడియా ప్రొఫెషనల్స్ అలా చేయడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. నాని చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నాని నిర్మాతగా కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని రేంజ్ అంతకంతకూ పెరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని ది ప్యారడైజ్ సినిమా కూడా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.