
విడుదల రోజు రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాల పైన చాలా ప్రభావం ఉంటుందని గత కొద్ది రోజులుగా కూడా టాలీవుడ్ లో ఇదే చర్చ కూడా జరుగుతోందని ఈ క్రమంలోనే నాని ఈ విషయం పైన మాట్లాడుతూ.. రివ్యూస్ అనేవి ఎందుకు ఆగాలి? ఎందుకు ఆపాలి..? ఎవరిని కూడా ఆపలేము..? నాకు నచ్చలేదు అనండి ఓకే కానీ సినిమా ఆడదని ముందుగానే చెప్పేస్తే ఎలా.. సినిమా డిజాస్టర్ అని ఒక్క రోజులోనే ఎలా నిర్ణయిస్తారు సినిమా విడుదలైన తరువాత పది రోజులు ఎవరూ చూడకపోతే అప్పుడు డిజాస్టర్ అని చెప్పండి కానీ ఫస్ట్ డే మార్నింగ్ షోకే అలా డిసైడ్ చేయకండి అంటూ తెలిపారు.
వ్యక్తిగతంగా సినిమాపైన అభిప్రాయం ఎలా చెప్పినా కూడా మీడియా ప్రొఫెషనల్ గా చూపించడం కూడా కరెక్ట్ కాదనే విధంగా తన అభిప్రాయం అని తెలిపారు. తన సినిమా విషయంలో మాత్రం ఇలాంటివి జరగదు.. కానీ కొంతమంది సినిమాల విషయంలో సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను చూసి చాలా తలనొప్పి వచ్చేసింది అంటూ పోస్టులు పెట్టినవి కూడా చూశాను.. వ్యక్తిగతంగా ఓకే అయినప్పటికీ ప్రొఫెషనల్ గా ఇలా చేయడం సరైనది కాదు అంటూ తెలిపారు నాని. మే 1న 3 సినిమా రిలీజ్ కాబోతోంది.